CSS Links
HTML లో ట్యాగ్ "<a href=" గురించి చదివి ఉన్నారు. ఈ ట్యాగ్ CSS style ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదాహరణకు Google Search లో ఏదైనా టైప్ చేసినప్పుడు దానికి సంబంధించి వందల రకాల links (లింక్స్) క్రింద డిస్ప్లే అవుతాయి. అందులో ఏ link ని open చేసినా ఆ link కలర్ మారుతుంది అనగా మనం ఇదివరకే ఆ link ని visit (open) చేసినట్టు సులువుగా అర్థం అవడానికి ఇలా జరుగుతుంది. ఈ విధంగా ఏదైనా link పై mouse hover చేసినప్పుడుదాని కలర్ మారితే అది active లో ఉంది అనుకుంటారు. అదే కలర్ మారకపోతే ఆ link పని చెయ్యడంలేదు అనుకునే అవకాశం కుడా ఎక్కువగా ఉంది ఇది మనిషి సహజగుణం. ఇదే విధంగా link ని visit చేసిన తరువాత అప్పుడు ఆ link కలర్ మరోలా ఉంటే మనం ఇదివరకే ఈ link ని visit చేసాము అని కుడా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక link యొక్క కలర్ ని మార్చడం ద్వారా దాని status (స్థితి) ని తెలిపే ఉద్దేశ్యంగా link property ని develop చెయ్యడం జరిగింది. ఈ property నాలుగు (4) values ని కలిగి ఉంటుంది.
- a:link - సాధారణ link కలర్
- a:hover - link పై mouse ని పెట్టినప్పుడు ఆ link యొక్క కలర్
- a:active - link ని click చేసేటప్పుడు ఆ link యొక్క కలర్
- a:visited - చివరిగా link ని open చేసినతరువాత link యొక్క కలర్
గమనిక : css లో links ని పైన చెప్పిన విధంగా సెట్ చేసేటప్పుడు వాటి క్రమాన్ని తప్పక పాటించాలి. అనగా "a:hover" అనేది "a:link", "a:visited" ల తరువాతనే వ్రాయాలి మరియు "a:active" అనేది "a:hover" తరువాతనే ఉండాలి.
<< Previous Next >>