<< Previous
Next >>
Border అనేది తక్కువలో తక్కువగా రెండు property లను తప్పక కలిగి ఉండాలి ఇందులో "style" అనేది తప్పనిసరి.ముందుగా ఈ style property కి గల విలువలను గురించి తెలుసుకుందాం.
<< Previous Next >>
border property
- border-style
- border-width
- border-color
"border : width style color;" దీన్నే border - shorthand property అంటారు.అనగా విడివిడిగా కాకుండా ఒకే లైన్ లో వ్రాయడం (క్రింది ఉదాహరణ లో ఇప్పడు మీరు చూస్తున్నట్లుగా కాకుండా అని అర్థం).
Border Shorthand Property Example |
Border అనేది తక్కువలో తక్కువగా రెండు property లను తప్పక కలిగి ఉండాలి ఇందులో "style" అనేది తప్పనిసరి.ముందుగా ఈ style property కి గల విలువలను గురించి తెలుసుకుందాం.
border-style values:
  border-style: dotted;
  border-style: dashed;
  border-style: solid;
  border-style: double;
  border-style: groove;
  border-style: ridge;
  border-style: inset;
  border-style: outset;
Border - Individual sides
క్రింది ఉదాహరణలో నాలుగు వైపులా నాలుగు వేర్వేరు రకాల border లను apply చేయడం జరిగింది.Border Width
Border యొక్క వెడల్పును నిర్ణయించేందుకు border-width అనే property ని ఉపయోగిస్తారు. width ని thin medium thick లేదా pixels లలో వివరించవచ్చును. ముందుగా border లను నిర్ణయించిన తరువాత మాత్రమే వాటి width ని నిర్ణయించవచ్చును. అనగా "border-width" property ని వాడాలి అనుకున్నప్పుడు "border-style" property ని ముందుగా నిర్ణయించవలసి ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే "border-width" property ఒంటరిగా పనిచెయ్యదు అని అర్థం. [length units : em, ex, %, px, cm, mm, in, pt, pc ఇవి మనం వాడే browser version లపై ఆధారపడి ఉంటాయి.అనగా ఈ unit లు browser లను బట్టి మారుతుంటాయి (సరిగ్గా పనిచెయ్యవు అంటే అన్ని browser లలో ఒకే విధమైన ఫలితాన్ని ఇవ్వవు అని అర్థం).]Click చేసి మార్పుని గమనించండి.
Border Color
border-color అనే property ద్వారా border యొక్క కలర్ ను మార్చవచ్చును. ఇందుకుగానూ ముందుగా border యొక్క style ను నిర్ణయించవలసి ఉంటుంది. అనగా border-style అనే property ని ఉపయోగించాకే border-color అనే property పనిచేస్తుంది.Click చేసి మార్పుని గమనించండి.
తదుపరి CSS Outlines Property గురించి...
<< Previous Next >>