<< Previous

JavaScript - Output

JavaScript లో వ్రాసిన కోడ్ ని execute చేసినపుడు వచ్చే ఫలితాన్ని(output) నాలుగు విధాలుగా చూపించవచ్చును. అనగా JavaScript ద్వారా డేటా ను వెబ్ పేజ్ పై (4) విధాలుగా మాత్రమే display చేయవచ్చును. అవి

  • innerHTML
  • document.write()
  • window.alert()
  • console.log()
అయితే వీటిని ఏయే సందర్భాలలో ఎలా వాడాలో తెలుసుకుందాము.

JavaScript - innerHTML

వెబ్ పేజ్ లో ఏదైనా విలువను డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఎక్కడ చెయ్యాలి అనే ప్రస్తావన వస్తుంది. ఇలాంటి సందర్భంలోనే "document.getElementById(id)" అనే method ఉపయోగపడుతుంది. ఈ method ద్వారా ఏదైనా మనకు కావలసిన ప్రత్యేకమైన element (మూలకం) ను ఎన్నుకోవటం (select చేయడం) సాధ్యమవుతుంది. ప్రస్తుతానికి "innerHTML" అనునది ఈ method తోపాటే పనిచేస్తుంది అనుకోండి. అది ఎలానో క్రింద చూద్దాం.


ఉదాహరణ
<!DOCTYPE html>
<html>
<body>

<h1>JavaScript - Tutorial</h1>
<h2>JavaScript - innerHTML</h2>

<p id="result">

< script >

document.getElementById("result").innerHTML =   3  +   8  ;                               
< /script >


</body>
</html>
    

       document లో గల ఏ మూలకాన్నయినా దాని "id" ద్వారా ఎన్నుకోటానికి getElementById(id) అనేదాన్ని వాడుతున్నారు అన్న విషయం సులభంగా అర్థం చేసుకోవచ్చు.

       పై ఉదాహరణలో "result" అనేది కేవలం "id" యొక్క పేరు మాత్రమే దీనికి బదులుగా ఇక్కడ మీరు 'x', 'y', 'z'......, అని ఏదైనా లేదా మీ పేరు వ్రాసినా పనిచేస్తుంది. అనగా error లేకుండా కోడ్ run అవుతుందని అర్థం. కానీ "id (identity)" అనేది meaningful గా ఉంటే బావుంటుంది. గుర్తుపెట్టుకోండి.

JavaScript - document.write()

"document.write()" అనగా డాక్యుమెంట్ (వెబ్ పేజ్) లో వ్రాయి అని అర్థం. ఇది మనకు స్పష్టం. కానీ ఎక్కడ వ్రాయాలి అనేదే సమస్య. పైన వివరించినట్లుగా "innerHTML" లో వలె మనకు కావలసిన చోట target చేసి "Output" ని డిస్ప్లే చేయలేము. ఈ "లొసుగు (loophole) వల్లనే "document.write()" అనే method ను JavaScript లో చాలా అరుదుగా వాడతారు. ఇంకోలా చెప్పాలంటే అసలు వాడరు అనుకోండి. కానీ దీన్ని గురించి తెలుసుకోవటం అవసరం మరియు మంచిదే.

HTML పేజ్ పూర్తిగా load అయినా తరువాత "document.write()" ని వాడటం వల్ల అది మిగిలిన అన్ని మూలకాలను వెబ్ పేజ్ నుండి తొలగిస్తుంది. (ఏ వెబ్ పేజ్ అయినా browser లో పూర్తిగా డౌన్లోడ్ అయిన తరువాతనే ఎగ్జిక్యూట్ అవుతుంది - కాబట్టి download ఎక్కడ అవుతుంది అని confuse కాకండి)


JavaScript - window.alert()

వెబ్ పేజ్ లో డేటా ను డిస్ప్లే ఎలా చెయ్యాలో చూసారు. కాని Warning messagesని డిస్ప్లే చెయ్యటానికి "Window.alert()" ని వాడుతారు. దీన్నే "alert()"గా కూడా వ్రాస్తారు (ఇందులో window అనేది ఒక "Object". దీన్ని గురించి వివరంగా మున్ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం). అయితే Warning messages అనేవి user చేసే input సరైనది కానప్పుడు డిస్ప్లే అయ్యేవిధంగా ప్రోగ్రామర్ లు కోడ్ వ్రాస్తారు. ఉదాహరణకు పైన వివరించిన "innerHTML" లోని sample web page లో మీరు విలువలను edit చేయకుండా Submit ను నొక్కితే alert box డిస్ప్లే అయ్యేవిధంగా నేను కోడ్ వ్రాయడం జరిగింది. గమనించండి. (user ని తెలుగులో ఉపయోక్త అంటారు ఇలా చెబుతూ పోతే JavaScript కి బదులు ట్యుటోరియల్ అయ్యేలోగా తెలుగే నేర్చుకుంటారు. అందువల్ల కొన్ని పదాలను ఇంగ్లీషులోనే వ్రాసాను మీరూ అలానే చదవండి)
ఏ వెబ్ టెక్నాలజీలోనయినా "alert" అంటే Warning అనే అర్థం. దీన్ని క్రింది విధంగా వాడుతారు.

JavaScript - console.log()

ఏదైనా Program రాసినప్పుడు Javascript లోనే కాదు మరి ఏ ఇతర లాంగ్వేజ్ లోనయినా సరే అందులో "errors" అనేవి వస్తాయి. అవి Syntax పరమైనవి కావచ్చు లేదా logical errors అయినా అయివుండవచు. అయితే ఈ errors ను మనము Integrated Development Environment (IDE) లేదా editors ను వాడి గుర్తించగలం. కానీ కొన్ని errors ని మాత్రం ఈ editor లు కూడా డిస్ప్లే చెయ్యలేవు అందువల్ల వాటిని గుర్తించటం కూడా కష్టమే. ఇలాంటి errors ని కలిగిన code ని run చేసినప్పుడు మాత్రం అది ఎటువంటి ఇబ్బంది లేకుండా run అవుతుంది. ఈ errors ని గుర్తించి సరిచేయడాన్నే "code debugging" అంటారు. debugging అనేది అంత సులభతరమైంది కాదు. కానీ ఇప్పుడు వచ్చిన ఆధునిక browser లు ఇలాంటి errors ని గుర్తించే విధంగా తయారు చేయబడినవి అనగా అవి debugger window ను కలిగి ఉంటాయి. ఈ debugger window లో మనము "console.log()" అనే method ను వాడి JavaScript విలువలను చూపించవచ్చును. ఈ JavaScript debugger అనే ఈ feature ని మనము browser యందు on లేదా off చేసుకోవచ్చును.

.
తదుపరి Data types అంటే ఏమిటి ...

<< Previous
Back to Top