<< Previous Next >>

వెబ్ పేజీని ఎలా తయారు (create) చేయాలో తెలుసుకుందాం.

     మీ కంప్యూటర్ లో "Notepad" ని "open" చేసి అందులో క్రింద ఉన్న దాన్ని టైపు చేయండి. తరువాత ఆ టెక్స్ట్ ఫైల్ (text file) ని "save as " "test.html " అని సేవ్ చేయండి. ఇందులో "test " అనేది మీ ఫైల్ పేరు మరియు ".html " అనేది మీ ఫైల్ ఫార్మాట్ ను తెలుపుతుంది. ఇలా ".net ", ".asp ", ".php ", ".xml " అని చాలా రకాల ఫార్మాట్ లు ఉన్నాయి. మీ ఫైల్ పేరు తరువాత ఫుల్ స్టాప్ (.) తరువాత ఉండే ఈ ఫార్మాట్లను "extensions " అంటారు. ఈ extensions ని బట్టి మీ ఫైల్ గురించి చెప్పవచ్చు. ఏ వెబ్ పేజి అయినా క్రింది ట్యాగ్ లను తప్పక కలిగి ఉంటుంది.


HTML పేజ్ ఉదాహరణ
HTML page format

"test.html " ఫైల్ పేరు క్రింద చూపిన అడ్రస్ బార్ లో టైప్ చేసి "enter button" ని click చెయ్యండి.
లేదా ఆ ఫైల్ పై "double click " (డబల్ క్లిక్) చేసినా అది ఓపెన్ అవుతుంది.

వెబ్ పేజిని బ్రౌజర్ (Browser ) సహాయంతో మాత్రమే చూడగలము. IE (ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్), google chrome ( గూగుల్ క్రోం), Mozilla Firefox (మోజిల్ల) అని చాలా రకాల బ్రౌజర్లు ఉన్నాయి. ఇవి ఒక అడ్రస్ బార్ ను కలిగి ఉంటాయి. ఇందులో వెబ్ సైట్ అడ్రస్ ను టైప్ చేస్తారు. క్రింది పటాన్ని పరిశీలించండి.


Address bar location on Internet Explorer


ముఖ్యమైన విషయం మనం ".txt " ఫైల్లను మాత్రమే మాములుగా "edit" (ఎడిట్ - అనగా ఏవైనా మార్పులు చేయగలగడం) చెయ్యగలం, ".html" ఫైల్ ను ఎడిట్ చెయ్యటానికి వేరే "Editor" లు చాలా ఉన్నాయి వాటిల్లో ఒకటైన EditPlus అనే ఎడిటర్ ను క్రింది బటన్ ను క్లిక్ చేయుటద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చును.

EditPlus is a text editor, HTML editor, PHP editor, Java editor and Hex Viewer for Windows. While it can serve as a good Notepad replacement, it also offers many powerful features for Web page authors and programmers.EditPlus Download Link 

HTML Images(ఇమేజెస్)

HTML లో ఇమేజెస్ ని (పటాలను) <img> అనే ట్యాగ్ ద్వారా డిస్ప్లే చెయ్యవచ్చు.దీనికి జత ట్యాగ్ ఉండదు.
<img> ట్యాగ్ అనేది HTML పేజ్ లో ఇమేజెస్ కు సరిపడా స్థలాన్ని క్రియేట్ (సృస్టించుట) చేస్తుంది.

వెబ్ పేజ్ లో ఈ విధంగా రాసిఉంటుంది.
<!DOCTYPE html>
<html>
<head>
</head>
<body>
<img src="images/smiley.jpg"
alt="Smiley face" height="42" width="52">

</body>
</html>

బయటికి మాత్రం ఇలా కనబడుతుంది.
Smiley face




<< Previous Next >>

Back to Top