Next >>

మీకు తెలుసా Internet, Browser మరియు Website అంటే ...

     వెబ్ సైట్ అంటే ఏమిటి? మనకు కావలసిన లేదా తెలుసుకోవాలనుకునే ఎలాంటి విషయాన్నయినా ఇంటర్నెట్ ద్వారా పొందే ఒక గొప్ప సదుపాయాన్ని (www) వరల్డ్ వైడ్ వెబ్ అనే సంస్థ కల్పించింది. మనం కూడా ప్రజలకు ఉపయోగకరమనుకునే ఎలాంటి విషయాన్నయినా ఇంటర్నెట్ ద్వారా తెలియజేయవచ్చు. ఉదాహరణకు మీరు వంటలు బాగా చెయ్యగలరు ఇదే విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా పబ్లిసిటీ ఎలా చెయ్యొచ్చు అనేది తెలుసు కుందాం. ఇంటర్నెట్ లో ఏ విషయాన్ని హోస్ట్ (host అనగా పబ్లిష్ చెయ్యడం. ఈ విధంగా పబ్లిష్ అయినదాన్ని బ్రౌజర్ ల ద్వారా మాత్రమే చూడటానికి వీలవుతుంది. బ్రౌజర్ అనగా ఇంటర్నెట్ ద్వారా తెలియజేసే ఎలాంటి విషయాన్నయినా చూపించడానికి ఉపయోగించే ఒక screen అనుకోవచ్చు. ఉదాహరణకు Internet Explorer - Microsoft సంస్థ చే తయారు చేయబడినది, Google Chrome - Google సంస్థ ద్వారా develop చేయబడినది. ఇలా చాలా రకాల బ్రౌజర్ లు వాడుకలో ఉన్నాయి) చెయ్యాలన్నా ముందుగా మనం ఒక ఎకౌంటు ఒక పేరుతో రిజిస్టర్ చెయ్యాల్సి ఉంటుంది. దీన్నే "డొమైన్ రిజిస్ట్రేషన్" అంటారు. డొమైన్ అనగా మీ ఎకౌంటు పేరు లేదా ఇంటర్నెట్ లో మీ అడ్రస్. మీరు వంటలకు సంబంధించిన బుక్ ని హోస్ట్ చేస్తున్నారు కనుక మీ డొమైన్ పేరు వంటలకు సంబంధించినదిగా ఉంటే బాగుంటుంది. ఉదాహరణకు "రుచులు" అని ఎంచుకోవచ్చు. మీరు రాసిన వంటల పుస్తకాన్ని ఒక "వెబ్సైటు" అనుకుంటే మీ పుస్తకం లోని పేజీలను "వెబ్ పేజెస్" అంటారు. పుస్తకాన్ని పెన్నుతో రాయవచ్చు లేదా అచ్చు వేయించవచ్చు. కాని ఇంటర్నెట్లో మీ పుస్తకాన్ని హోస్ట్ చెయ్యాలి అంటే దాన్ని "HTML", "CSS" అనే రెండు లాంగ్వేజెస్ లో రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా రాసిన మీ పుస్తకాన్ని ఎవరైనా చదవాలి అనుకుంటే వారు అడ్రస్ బార్ లో "www.మీ డొమైన్ పేరు.com" అని టైపు చెయ్యాల్సి ఉంటుంది. ఇందులో ".com" అంటే కమర్షియల్ అని అర్థం. అంటే ఉదాహరణకు మీరు ఒక పిల్లల సంస్థ గురించి ఇంటర్నెట్ ద్వారా పబ్లిసిటీ చెయ్యాలనుకుంటే అప్పుడు మీ సంస్థ పేరు చివర ".org" అని రిజిస్ట్రేషన్ చేస్తే మంచిది (".org" అనగా "Organization" అని అర్థం). ప్రపంచం అంతా పైన చెప్పిన "HTML" మరియు "CSS" అనే లాంగ్వేజెస్ తో పాటు ఇతర లాంగ్వేజెస్ ని కుడా వాడతారు కాని ఈ లాంగ్వేజెస్ వాడకుండా ఒక వెబ్సైటు ని డిజైన్ చెయ్యలేరు. ముందుగా ఈ లాంగ్వేజెస్ ని గురించి తెలుసు కుందాం.

     "HTML" అనగా "హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్". ఇది మనం రాసే టెక్స్ట్ ని వివిధ సైజు లలో డిస్ప్లే చెయ్యడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది. సాధారణంగా మనం ఏదైనా విషయాన్ని గురించి రాసేటప్పుడు దాని హెడ్డింగు పెద్ద సైజు లో రాస్తాము ఇదే విధంగా వెబ్సైటు లో హెడ్డింగు సైజు పెద్దదిగా రాయటానికి "HTML" లాంగ్వేజ్ లో ట్యాగ్ లను వాడతారు ఇవి జతగా ఉంటాయి. ఉదాహరణకు <h1>,</h1> అనేవి ఒక జత ట్యాగ్. వీటిని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం.

వెబ్ పేజ్ లో ఈ విధంగా రాసిఉంటుంది.
<!DOCTYPE html>
<html>
<head>
</head>
<body>
<h1>your heading</h1>
</body>
</html>

బయటికి మాత్రం ఇలా కనబడుతుంది.

your heading



అంటే ప్రతి ట్యాగ్ దాని జత ట్యాగ్ తో మాత్రమే పూర్తి అవుతుంది మరియు చివరి ట్యాగ్ లో "/" ఇది అదనంగా ఉంటుంది అప్పుడే అది పూర్తి అయినట్టు లెక్క. ఇలా ఆరు (6) జతల ట్యాగ్ లను మాత్రమే "HTML" కలిగి ఉంది మరియు ఇవి కేవలం హెడ్డింగు సైజులను మార్చటానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇలా రాసే టెక్స్ట్ ని కలర్ లో డిస్ప్లే చెయ్యటానికి "CSS" అనే language ని వాడతారు.
ముందుగ "HTML" బేసిక్ ట్యాగ్ ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. హెడ్డింగ్ ని "బోల్డ్ లెటర్స్" లో డిస్ప్లే చెయ్యాలంటే <b>,</b> అనే జత ట్యాగ్ ని , హెడ్డింగ్ క్రింద అండర్ లైన్ గీయటానికి <u>,</u> అనే జత ట్యాగ్ ని మరియు హెడ్డింగ్ ని "italic" స్టైల్ (క్రింద చూడుము) లో డిస్ప్లే చెయ్యటానికి <i>,</i> అనే జత ట్యాగ్ ని వాడతాము.

వెబ్ పేజ్ లో ఈ విధంగా రాసిఉంటుంది.
<!DOCTYPE html>
<html>
<head>
</head>
<body>
<b>your heading</b>
<u>your heading</u>
<i>your heading</i>
</body>
</html>

బయటికి మాత్రం ఇలా కనబడుతుంది.
your heading
your heading
your heading



తరువాత ట్యాగ్ <p>,</p> వీటిని పారగ్రాఫ్ ట్యాగ్స్ అంటారు. అంటే మనం ఏదైనా పారగ్రాఫ్ రాసినప్పుడు దాన్ని ఈ ట్యాగ్ ల నడుమ ఉంచడం పద్దతి. ఈ ట్యాగ్ ల విలువ, ఉపయోగం గురించి మున్ముందు తెసుకుంటే మీకు సులభంగా అర్థం అవుతుంది. ప్రస్తుతం మాత్రం ఒక పారగ్రాఫ్ ని వెబ్ పేజి లో రాయాలంటే మనం దాన్ని ఈ ట్యాగ్ ల నడుమ రాయడం మంచి అలవాటు . ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.
[ ట్యాగ్ లను చిన్న అక్షరాలలో రాయడం సరైన పద్దతి.]

ట్యాగ్ <a>,</a> గురించి తెలుసు కుందాం. ఇది ముఖ్యమైనది మరియు చాలా చోట్ల ఉపయోగ పడుతుంది. దీని "Syntax" (వాక్యనిర్మాణం) చూద్దాం.
<a href = "టార్గెట్ వెబ్ సైట్ లేదా పేజి లేదా పారగ్రాఫ్" > పదము</a>
సాధారణంగా మనం పుస్తకంలో మనకు కావలసిన ఒక పాఠాన్ని చదవాలంటే ఆ పాఠం విషయ సూచికలో ఏ పేజిలో ఉందో చూసుకొని తరువాత ఆ పేజీకి వెళతాం. ఇదే విధంగా ఇంటర్నెట్లో మీ పుస్తకం (వెబ్ సైట్) ఉంచినపుడు అందులోని ఒక పాఠాన్ని (వెబ్ పేజీని) వెతకటానికి విషయ సూచికలో ఆ పాఠం పేరును
<a href = "మీ పాఠం ఉన్న పేజి లింకు" > మీ పాఠం పేరు </a>
అని రాయాలి.
వెబ్ పేజ్ లో ఈ విధంగా రాసిఉంటుంది.
<!DOCTYPE html>
<html>
<head>
</head>
<body>
<a href="target link">my website</a>
</body>
</html>

బయటికి మాత్రం ఇలా కనబడుతుంది.

[ఒక్క విషయం ట్యాగ్ అనేవి బయటికి కనబడవు వాటి ప్రభావం మాత్రమే బయటికి కనబడుతుంది. అంటే మీ వెబ్ సైట్ ని ఓపెన్ చేసినప్పుడు రీడర్స్ కి " మీ పాఠం పేరు " అన్న పదం మాత్రమే కనబడుతుంది మిగతాది కనబడదు. అనగా పైన రెడ్ కలర్ లో ఉన్నది వెబ్ పేజీలో బయటకు కనబడదు.]
ఇప్పుడు ఒక వెబ్ పేజీని ఎలా తయారు (create) చేయాలో తెలుసుకుందాం.


Next >>
Back to Top